Sun Mar 29 2026 15:57:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జైట్లీ సోమవారం చూస్తారట....!

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భేటీ అయ్యారు. నిన్నటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం త్వరితగతిన చర్యలు చేపట్టాలని వారు జైట్లీని కోరారు. సోమవారం అధికారులతో చర్చించి చర్యలు ముమ్మరం చేద్దామని చెప్పారు అరుణ్ జైట్లీ. నిన్నటి సమావేశంలో అరుణ్ జైట్లీ, అమిత్ షా, సుజనా చౌదరి పాల్గొని ఏపీ విభజన హామీలు అమలుకు చేయాల్సిన చర్యలపై చర్చించారు. దీని ప్రకారం సీఎం రమేష్, సుజనాచౌదరి ఫాలో అప్ చేశారు. అయితే సోమవారం అధికారులతో మాట్లాడతామని, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- Tags
- అరుణ్ జైట్లీ
Next Story

