Thu Mar 26 2026 20:33:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వం రద్దు

నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిన్న జరగిన సంఘటన ప్రజాస్వామ్యనికే మాయని మచ్చని మిగిల్చిందని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను శాసనసభ్యత్వం రద్దు చేశారు. అయితే ఈ సమావేశాల వరకూ జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీకే అరుణ, పద్మావతి మల్లుభట్టివిక్రమార్క, వంశీ చందర్ రెడ్డి తదితరులను సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభ వ్యవహారల మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. నిన్న శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పై దాడి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నాలుగేళ్ల నూతన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 11 మంది సభ్యులను ఈ సమావేశాల వరకూ సస్పెండ్ చేశారు.
- Tags
- కోమటిరెడ్డి
- సంపత్
Next Story

