Thu Apr 02 2026 21:18:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేసీఆర్ ఇంటికి పవన్ కల్యాణ్

ప్రగతి భవన్ కు కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చారు.ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అయితే పవన్ కల్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ ఉద్యమ నేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పై కూడా కేసీఆర్ సెటైర్లు వేశారు. ఇప్పటి వరకూ కేసీఆర్ ను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రగతి భవన్ కు రాలేదు. అయితే పవన్ కల్యాణ్ వచ్చిన సమయంలో కేసీఆర్ గవర్నర్ ను కలిసేందుకు రాజ్ భవన్ వెళ్లారు. ఆయన వచ్చిన వెంటనే పవన్ కేసీఆర్ ను కలుస్తారు. పవన్ కల్యాణ్ ప్రగతి భవన్ కు రావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య రాజకీయపరమైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Next Story

