Fri Mar 27 2026 03:48:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ అభ్యర్ధిని నిలపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యాపరంగా చూసుకుంటే మూడు స్థానాలనూ అధికార టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలపాలని నిర్ణయం తీసుకుంది. పరిశీలనలో గూడూరు నారాయణరెడ్డి, అజారుద్దీన్ పేర్లను ఉన్నట్లు సమాచారం. కొందరు మాత్రం అమరవీరుల కుటుంబాలనుంచి ఎవరినైనా నిలబెట్టాలని ప్రతిపాదించారు. అయితే అభ్యర్థులెవరనేది తెలియకపోయినా కాంగ్రెస్ తరుపున అభ్యర్థిని నిలబెట్టాలని మా్త్రం నిర్ణయిచండం నిజంగా సంచలనమే. సీఎల్పీ సమావేశంలో పార్టీ ఇన్ ఛార్జి కుంతియా కూడా పాల్గొన్నారు.
- Tags
- కాంగ్రెస్
Next Story

