Sun Mar 22 2026 10:20:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో ఐటీ దాడుల కలకలం

ఆంధ్రప్రదేశ్ లోనూ ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావు ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈరోజు బీద సోదరులకు చెందిన దామవరం, ఇసుకపల్లిలోని కార్యాలయాలపై అధికారులు సోదాలు చేశారు. చెన్నైలోని బీఎంఆర్ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీద సోదరుల ఆస్తులపై ఐటీ దాడులతో ఏపీ తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. దాడులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

