Wed Mar 25 2026 18:51:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ విషయంలో కాంగ్రెస్ రంగంలోకి దిగింది

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వచ్చే మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మల్లికార్జున ఖర్గే నోటీసులు ఇచ్చారు. లోక్ సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో రాజకీయం రసకందాయంలో పడింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో కేంద్రం కొంత ఇరకాటంలో పడిందనే చెప్పాలి. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులతో మాట్లాడి వారిని ఆందోళన చేయకుండా కట్టడి చేసి అవిశ్వాస తీర్మానం పై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.
Next Story

