Mon Apr 06 2026 23:42:33 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్యే జంప్ అవుతారా?

ఏ పరిణామం జరిగినా ఢిల్లీలోనే జరగుతున్నాయి.రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చి చేరిపోయారు. అలాగే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఢిల్లీలో మంత్రి హరీశ్ రావును కలిశారు. వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని సంపత్ అనేకసార్లు బహిరంగంగానే విమర్శించారు. ఇటీవల రేవంత్ రెడ్డిని తన ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు సంపత్ పై డీకే అరుణ ఫైరయ్యారు. ఇలా వరుస సంఘటనలు సంపత్ ను పార్టీని వీడేలా చేస్తున్నాయన్నది ఆయన సన్నిహితుల సమచారం. మొత్తం మీద ఢిల్లీలో హరీశ్, సంపత్ చర్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది.
- Tags
- సంపత్ కుమార్
Next Story

