Mon Apr 13 2026 04:32:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎంపీల చేత రాజీనామా చేయిస్తా: జగన్

ప్రత్యేకహోదాకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని జగన్ స్పష్టంచేశారు. అనంతపురంలో జరుగుతున్న యువభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ప్రత్యేక హోదాకార్యక్రమాన్ని వదిలపెట్టలేదన్నారు. విద్యార్థులకు పరీక్షలు, కళాశాలలకు సెలవులు ఉన్నందునే తాను ప్రత్యేక హోదాకార్యక్రమంపై కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఇకపై దీన్ని వదలేది లేదన్నారు. తాను నవంబర్ 2వ తేదీ నుంచి ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, ఇందులో కూడా ప్రత్యేక హోదాపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. చివరి అస్త్రంగా తాను ఎంపీలచేత రాజీనామా చేయిస్తానని, ప్రత్యేక హోదా సాధించేంత వరకూ వెనుకాడబోనని ప్రకటించారు. తాను తప్ప ప్రత్యేకహోదాపై ఎవరైనా మాట్లాడారా? అని జగన్ ప్రశ్నించారు.
- Tags
- జగన్
Next Story

