Fri Mar 27 2026 17:29:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎంపీ జేసీ మాజీ పీఏ ఆత్మహత్యాయత్నం

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేశ్ రెడ్డి ఆత్మహత్యా యత్నంచేశారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి మనస్తాపం చెందిన సురేష్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో సురేష్ రెడ్డిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు మాత్రం తాము విచారిస్తుండగా స్పృహ కోల్పోయాడని, నిద్రమాత్రలు వేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. గతంలో సురేష్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ సస్పెండ్ అయ్యారు.
Next Story

