Tue Mar 24 2026 20:02:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అరనిమిషంలోపే లోక్ సభ వాయిదా

లోక్ సభ ప్రారంభమైన అరనిమిషానికే లోక్ సభ వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ సభలో అన్నాడీఎంకే సభ్యులు యధావిధిగా ఆందోళనకు దిగారు. లోక్ సభ పదోరోజు కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు అన్ని పార్టీలూ ఇచ్చాయి. అయితే అన్నాడీఎంకే సభ్యుల నిరసనతో సభ ప్రారంభమైన అర నిమిషానికే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా అన్నాడీఎంకే సభ్యులు శాంతించలేదు. కావేరి జలాలపై బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనని వారు ప్లకార్డులు పట్టుకుని పెద్దయెత్తున నినాదాలు చేయడంతో సభ మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది.
Next Story

