Thu Mar 26 2026 20:29:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 48 గంటల దీక్ష

తమ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు 48 గంటల దీక్షకు దిగనున్నారు. ఇద్దరి శాసనభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేశారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీరి దీక్షకు సంఘీభావంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం దీక్ష ప్రారంభమవుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తొలుత దీక్షను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రారంభించాలనుకున్నప్పటికీ పోలీసులు అనుమతించరని భావించి, గాంధీ భవన్ లో దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. సభ్యుల సస్పెన్షన్, శాసనసభ్యత్వాల రద్దుపై రేపు కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించాలని నిశ్చయించింది.
- Tags
- 48 గంటల దీక్ష
Next Story

