Tue Mar 31 2026 20:06:40 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం నిజంగా సంచలనమే. వీరంతా లాభదాయక పదవులను పొందడమే కారణం. అనర్హత వేటు నివేదికను ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి పంపింది. వాళ్లను అనర్హులుగా ప్రకటించమని సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఈసీ నిర్ణయంతో ఆప్ సర్కార్ ఇరకాటంలో పడింది. ఈ 20 మందిని పార్లమెంటు సెక్రటరీలుగా నియమించడమే వివాదానికి కారణం.
Next Story

