Sat Apr 11 2026 18:40:54 GMT+0530 (India Standard Time)
బెజవాడలో రేవంత్ రెడ్డి

టీటీడీపీ నేత బెజవాడ వచ్చారు. అమరావతిలో జరిగే టీటీడీపీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలకభేటీ అవుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి వ్యవహారం మరికాసేపట్లో తేలిపోనుంది. రేవంత్ రెడ్డి బెజవాడ రారని అందరూ భావించారు. కాని తన వాదనను విన్పించేందుకు ఆయన విజయవాడకు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా తనపై వస్తున్న ఆరోపణలకు ఆయన వివరణ ఇవ్వనున్నారు. అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టనున్నాయో కూడా వివరించనున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా పార్టీకి రాజీనామా చేస్తారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. నేతలతో వన్ టూ వన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
- Tags
- రేవంత్ రెడ్డి
Next Story

