బీజేపీపై తొగాడియా సీరియస్

విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు. గుజరాత్ లో ఎప్పటి కేసునో ఇప్పుడు బయటకు తీసి తనను వేధిస్తున్నారని తొగాడియా ఆరోపించారు. ప్రవీణ్ తొగాడియా కోసం రాజస్థాన్, గుజరాత్ పోలీసులు వెదుకుతున్నారు. ఆయన నిన్న అదృశ్యమయ్యారు. అయితే ఆయన తాను ఎక్కడికి వెళ్లలేదని ఆరోగ్యం బాగా లేకనే ఆస్పత్రిలో ఉన్నానని చెప్పారు.
కేంద్రం కుట్ర అంటున్న ప్రవీణ్....
తనను అంతమొందించడానికి కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయోధ్య రామమందిరం విషయాన్ని లేవనెత్తినందుకే తనను వేధిస్తున్నారన్న తొగాడియా తాను ఎక్కడికీ పారిపోలేదని, తనకు స్వస్థత చేకూరిన వెంటనే పోలీసులకు లొంగిపోతానని చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో బీజేపీ, కేంద్రంపై విరుచుకుపడటం విశేషం. పదేళ్ల క్రితం నాటి కేసులో నన్ను వేధిస్తున్నారన్నారు. తన వాదనను విన్పించుకోవడం లేదన్నారుద. తనపై అరెస్ట్ వారెంట్ చట్ట విరుద్ధమని చెప్పారు ప్రవీణ్ తొగాడియా.
- Tags
- ప్రవీణ్ తొగాడియా

