బావ సీరియస్ ... బామ్మర్ది సింగ్స్

ఎపి సీఎం చంద్రబాబు ఢిల్లీ తో అమితుమీ తేల్చుకోవడానికి భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు సీరియస్ గా ఢిల్లీ బాట పట్టారు. మూడు రోజులపాటు హస్తినలో బాబు తన వ్యూహాలను స్వయంగా అమలు అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలు రోజు అవిశ్వాసం నోటీసులు ఇస్తుండటం లోక్ సభ ను రోజు స్పీకర్ వాయిదా వేస్తుండటంతో ఎంపీలు పార్లమెంట్ బయట ప్లే కార్డు ల ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఎపి అభివృద్ధికి టిడిపి మాత్రమే చిత్తశుద్ధితో పోరాడుతుందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా పంపేందుకు ఆయన చేయని పోరాటం లేదు. మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ సెషన్స్ నడిచే అవకాశం ఉండటంతో విభజన సమస్యలు, ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చాలని నిర్ణయించారు.
లేపాక్షి ఉత్సవాల్లో చిందేసి సాంగ్ పాడిన బాలయ్య....
ఒక పక్క చంద్రబాబు సీరియస్ గా ఇప్పుడు ఉద్యమం కొనసాగిస్తుంటే ఆయన బామ్మర్ది వియ్యంకుడు లేపాక్షి ఉత్సవాల్లో దుమ్ము లేపుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే గా కూడా వున్న నటుడు బాలకృష్ణ ఉత్సవాల్లో స్టేజ్ పై స్టెప్పులేస్తూ వసూలు వసూలు పైసా వసూల్ అంటూ ప్రేక్షకులకు జోష్ తెచ్చారు. హోదా ఉద్యమంలో సినీనటులు సీరియస్ గా పాల్గొనడం లేదంటూ ఈ మధ్యనే టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎక్కువమంది నటులు దర్శకులు, నిర్మాతలు టిడిపి సానుభూతిపరులు. స్వయంగా హీరో బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్నా నటుల తరపున ఉద్యమానికి ఎందుకు నాయకత్వం వహించడం లేదన్న ప్రశ్న తలెత్తుతుంది. ఫలితంగా పలువురు నెటిజెన్స్ బాలయ్యపై విమర్శలు... ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.
