బాలయ్య బాబు ఇందుకే అలా చేశారా?

అనుకుని కుర్చున్నారో ? తెలియక పొరపాటున కుర్చున్నారో కానీ బాలకృష్ణ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చుని అధికారులతో సమీక్ష నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. లేపాక్షి ఉత్సవాలు, హిందూపురం నియోజకవర్గ సమస్యలపై అమరావతిలో బావ లేని సమయంలో బాలయ్య చేసిన ఈ పని తరువాత విస్తృత చర్చే నడుస్తుంది. మొదట చంద్రబాబు స్థానంలో కూర్చుని సమీక్ష జరిపిన తరువాత కొద్ది సేపు తరువాత పక్క సీట్లోకి మారారు బాలకృష్ణ. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం విభిన్నంగా స్పందించింది. ఒకసారి ఆయన కుర్చీ మార్చుకుని కూర్చున్నారని మరోసారి ఆయన పక్కన వేరే సీట్ వేసుకుని కూర్చున్నారని రెండువాదనలు తెచ్చింది.
మంచి రోజు కావడంతో ....
బాలయ్య జాతకాలను బాగా నమ్ముతారు. ఆయన సినిమాలు కానీ ఇతర రాజకీయ అంశాల్లోనూ ముహూర్తం ప్రకారం నడుచుకుంటారు. ఆయన జాతక చక్రం ప్రకారం ఈ ఏడాది మహారాజయోగం సెప్టెంబర్ లో మొదలు కాబోతుందని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవిత్రమైన రధసప్తమి రోజున ముహూర్తం ప్రకారమే బాలయ్య ముఖ్యమంత్రి సీట్ ఎక్కి ఉంటారని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. మరికొందరు దీనిని కొట్టిపడేస్తున్నారు.
దక్షిణాదిన ఆరంభమైన సినీ ప్రభంజనం ...
దక్షిణాదిలో పవన్ కళ్యాణ్ మొదలు కొని, రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ వంటివారంతా రాజకీయాలపై సీరియస్ గా ఈసారి దృష్టి పెట్టారు. రజని అయితే తమిళనాడు సీఎం కావాలని సంకల్పిస్తే పవన్, కమల్ హాసన్ లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సైతం గతానికి భిన్నంగా పాలిటిక్స్ లో స్పీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకోసమే ఎన్టీఆర్ బయోపిక్ కి ఆయన శ్రీకారం చుట్టారని పొలిటికల్ టాక్. బావ చంద్రబాబు అల్లుడు లోకేష్ తో విభేదాలు లేనప్పటికీ నందమూరి వంశం రాజకీయాల్లో రామారావు తోనే ముగిసిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ పెద్ద సీట్ నే కోరొచ్చని అంటున్నారు. కుమారుడు మోక్షజ్ఞ ని వెండితెరకు పరిచయం చేసి తండ్రి బాటలో బాలయ్య ప్రయాణిస్తారన్న చర్చ సాగుతుంది.
ఎమ్యెల్యేగా సక్సెస్ ....
హిందూపురం ఎమ్యెల్యేగా బాలకృష్ణ పై ఎలాంటి రిమార్క్స్ లేవు. అభిమానులు మీద పడితే చెంపదెబ్బలు వేస్తారు తప్ప మరోవిధంగా ఆయనపై ఆరోపణలు లేవు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బసవతారకం ఆసుపత్రిలో చక్కటి సేవలు అందిస్తున్నారు కూడా. శాసన సభ లోను ఆయన పెరఫార్మెన్స్ రిపోర్ట్ బానే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని పురంధరేశ్వరి కొనసాగిస్తుండగా బాలయ్య బావ అల్లుళ్లకు సహకరిస్తున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలకు వెళ్ళి ములాయం తరహాలోనే లోకేష్ ని ముఖ్యమంత్రిని చేస్తారన్న టాక్ ఒకవైపు వుంది. అల్లుడుకి వయస్సు రీత్యా చాలా అవకాశాలు వస్తాయి కనుక ఎప్పటినుంచో నందమూరి అభిమానుల్లో బాలయ్య సీఎం కావాలన్న కోరికను బావ బాబు దగ్గర ఆయన వ్యక్తం చేయవచ్చంటున్నారు. రాజకీయాల్లో బాలయ్య ఒక టర్మ్ ఎమ్యెల్యేగా అనుభవం సంపాదించడంతో ఆయన సీఎం అభ్యర్థి అన్నా ప్రజల్లో క్రేజ్ వుండే ఛాన్స్ వుంది. మొత్తానికి బాలయ్య కాకతాళీయంగా సీఎం సీట్లో కూర్చున్నా ఆయన అభిమానులు అది నిజం కావాలని కోరుకోవడం విశేషం.
- Tags
- బాలకృష్ణ

