Tue Mar 31 2026 07:23:48 GMT+0530 (India Standard Time)
బాబుపై ‘‘విష్ణు’’ చక్రం....!

బీజేపీ నేత వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీఎల్పీలో ఈ సమావేశం జరిగింది. పీఏసీ సమావేశం వివరాలు వెల్లడించడానికి ఏర్పాటు చేసిన సమావేశం కావడంతో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో కలిసి బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం దారుణమని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలుచేశారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన వారిని ఎలా మంత్రులుగా కొనసాగిస్తారని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. రాజీనామాలు చేయకుంటే పార్టీని ఫిరాయించిన వాళ్లు మంత్రులు కావచ్చన్న చట్టం తేవాలని ఎద్దేవా చేశారు. మొత్తం మీద బీజేపీ శాసనసబ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అధికార తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారాయి.
- Tags
- విష్ణుకమార్ రాజు
Next Story

