Mon Apr 06 2026 22:13:32 GMT+0530 (India Standard Time)
బాబుపై కేవీపీ ఫైర్

పోలవరం స్పిల్ వే, స్పిల్ ఛానల్ ఆపాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. దీనిపై రాజ్యసభ సభ్యుడుకేవీపీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. పోలవరం పై కేంద్ర తీరును కేవీపీ తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు వరుస అడ్డంకులు ఏర్పడుతున్నా చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు. ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపాలని యూపీఏ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందన్నారు కేవీపీ. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నా ఏమీ మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు ఇకనైనా మాటలు చెప్పడం మానిచేతల్లో చూపించాలని కోరుతున్నారు.
- Tags
- కేవీపీ
Next Story

