Sat Apr 04 2026 17:33:48 GMT+0530 (India Standard Time)
బాబును పొగడ్తలతో ముంచెత్తిన కేటీఆర్

తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెగ పొగిడేశారు. హైదరాబాద్ ను ఐటీ రంగంలో నిలిపిన ఘనగ చంద్రబాబుదేనని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కు ఐటీ పరిశ్రమలను తెప్పించడంలో చంద్రబాబు చేసిన కృషిని కేటీఆర్ ప్రశంసించారు. హైదరాబా్ లోని హైటెక్స్ సిటీలోని టెక్ మహేంద్ర వార్షిక ఆవిష్కరణ దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్ మహీంద్ర సీఈవో గుర్నానీ అడిగిన్న ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దడంలో చంద్రబాబు పాత్ర అమోఘమన్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయంటే అది చంద్రబాబు ఘనతేనని కేటీఆర్ కొనియాడారు. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుదేనని, తాను ఇప్పటికే ఉన్న ఐటీ పరిశ్రమను అభివృద్ధి మాత్రమే చేస్తున్నానని వినమ్రంగా చెప్పడం విశేషం.
Next Story

