Sun Apr 28 2024 08:50:30 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు నిరుద్యోగుల ధన్యవాదాలు
2017-18 బడ్జెట్ లో నిరుద్యోగ యువతకు రూ. 500 కోట్లు కేటాయించడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు యువకులు.దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనట్టుగా తొలిసారి నిరుద్యోగులకు బడ్జెట్లో నిధులు కేటాయించారని సంతోషం వ్యక్తం చేసారు.బడ్జెట్లో నిధుల కేటాయింపు ద్వారా నిరుద్యోగ యువతకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.యువత భవితకు బంగారు బాట వేయడానికి నిధులు సద్వినియోగం చేస్తామన్నారు.
నిధుల వినియోగానికి సంబంధించి నిరుద్యోగ నాయకులతో చర్చించి త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని హామీ ఇచ్చారు.నైపుణ్యాభివృద్ధి శిక్షణకు కేటాయించిన రూ.398 కోట్లను సైతం నిరుద్యోగ యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఖర్చు చేస్తామని చెప్పారు.
- Tags
- చంద్రబాబు
Next Story