Sun Mar 29 2026 05:43:44 GMT+0530 (India Standard Time)
బాబుకు జగన్ ఛాలెంజ్....!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ తాజాగా సవాల్ విసిరారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసేందుకు ఏప్రిల్ ఆరోతేదీన సిద్ధంగా ఉన్నారని, దమ్ముంటే టీడీపీ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించాలని సవాల్ చేశారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని జగన్ చె్పారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే మన ఉద్దేశ్యాన్ని కేంద్రప్రభుత్వానికి స్పష్టంగా చెప్పినట్లవుతుందన్నారు. పదవులకు రాజీనామాలు చేయకుండా పార్లమెంటులోపల, బయట ఆందోళన చేస్తే కేంద్రం దిగిరాదని, తన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమివ్వాలని కోరారు జగన్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ చంద్రబాబుకు ఈ ఛాలెంజ్ చేశారు.
Next Story

