బాబు కంటే దేవాన్ష్ ఆస్తులేఎక్కువా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ప్రతి ఏడాది తమ ఆస్తుల వివరాలను ప్రకటించడం నారా ఫ్యామిలీకి ఆనవాయితీగా వస్తుంది. ఏడేళ్ల నుంచి చంద్రబాబు కుటుంబం ఆస్తులను ప్రకటిస్తూ వస్తుంది. చంద్రబాబు ఆస్తులు ఈ ఏడాది కాలంలో ఏమాత్రం పెరగలేదని చెప్పారు. మార్కెట్ రేటు ప్రకారం కొన్ని ఆస్తుల విలువ పెరుగుతుందని, కొన్ని తగ్గుతాయని లోకేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆస్తులు 37 లక్షలు మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు పేరుతో 3.58 కోట్ల అప్పులున్నాయన్నారు. తమపై ఆరోపణలు చేసే ముందు వారు తమ ఆస్తులను ప్రకటించాలని లోకేష్ కోరారు. లోకేష్ ఆస్తుల విలువ 15.20 కోట్ల రూపాయలని చెప్పారు. దేవాన్ష్ ఆస్తుల విలువ 11.54 కోట్లు, బ్రాహ్మణి ఆస్తుల విలువ 15 కోట్లని లోకేష్ వివరించారు. తమ కుటుంబానికి ఆదాయం హెరిటేజ్ నుంచి వస్తుందని చెప్పారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తూ లాభాలను గడిస్తున్నామని చెప్పారు. జగన్ కూడా తన ఆస్తుల వివరాలను ప్రకటించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీలో ప్రతిపక్షమే లేదన్నారు. తామే అధికార పక్షం, తామే ప్రతిపక్షమన్నారు. గత అసెంబ్లీలో కూడా తమ ఎమ్మెల్యేలే తమను నిలదీశారని చెప్పారు.
- Tags
- లోకేష్

