బాబు అక్షింతలతో అలిగిన ఎమ్యెల్యే ...?

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం లో నిన్న మొన్నటి వరకు ఇంటింటికి తెలుగుదేశం ధూమ్ ధామ్ గా సాగింది. గత కొద్ది రోజులుగా మాత్రం ఇక్కడ ఇంటింటికి మూగ బోయింది. కారణం చంద్రబాబే అంటున్నాయి అక్కడి పార్టీ వర్గాలు. రామచంద్రపురం లో ఎక్కడా లేనివిధంగా ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు కాలికి బలపం కట్టుకుని ఇంటింటికి తిరుగుతుంటే సి గ్రేడ్ మార్కులు అధినేత చంద్రబాబు వేశారు. దాంతో త్రిమూర్తులు మనస్థాపం చెందారని ఆఫ్ ది రికార్డ్ టాక్.
ఎగిరి దంచినా అంతే కూలి ...
ఎగిరి దంచినా అంతే కూలి ... ఎగరకుండా దంచినా అంతే అన్నచందంగా ఇంటింటికి టిడిపి లో గ్రేడింగ్ సాగుతుందన్న ఆరోపణలు కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్లు ఆవేదనగా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమం పై అధినేత రివ్యూ చేసినప్పుడు తోట త్రిమూర్తులు ఎవరు ఎలా చేసినా తమ నియోజకవర్గంలో సూపర్ గా చేస్తున్నాం అన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ అయితే మీకు సి గ్రేడ్ ఎందుకు వచ్చింది అని అందరిలో వ్యాఖ్యానించడంతో తోట చిన్నబుచ్చుకున్నారని తెలుస్తుంది. దాంతో అప్పటివరకు చురుగ్గా పార్టీ కార్యక్రమాన్ని జనం ముందుకు తీసుకువెళ్లిన ఆయన స్లో చేశారని తెలుస్తుంది. సొంత పనులు కు సమయాన్ని కేటాయిస్తూ ఖాళీ సమయాల్లో ఇంటింటికి వెళ్ళేలా ఆయన సీన్ మార్చడం చర్చనీయాంశం అయ్యింది.
- Tags
- తోట త్రిమూర్తులు

