Mon Mar 23 2026 08:14:37 GMT+0530 (India Standard Time)
బాధిత కుటుంబానికి బాబు భరోసా

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు ప్రభుత్వఆసుపత్రికి వచ్చారు. అక్కడచికిత్స పొందుతున్న దాచేపల్లి బాధితురాలిని పరామర్శించారు. వారికుటుంబ సభ్యులను ఓదార్చారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో మూడు రోజుల క్రితం బాలికపై అదే గ్రామానికిచెందిన సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.
Next Story

