Tue Apr 07 2026 11:24:13 GMT+0530 (India Standard Time)
బండ్ల గణేష్ కు జైలు శిక్ష

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు జైలు శిక్ష పడింది. ఎర్రమంజిల్ కోర్టు బండ్ల గణేష్ కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. టెంపర్ సినిమాకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ వేసిన కేసును విచారించిన కోర్టు ఇందులో గణేష్ తప్పుందని నిర్ధారించింది. టెంపర్ సినిమాకు రచయితగా పనిచేసినందుకు చెక్కును బండ్ల గణేష్ రచయిత వక్కంతం వంశీకి ఇచ్చారు. అయితే ఆ చెక్కు చెల్లలేదు. దీనిపై వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల శిక్షతో పాటుగా 15.86 లక్షల జరిమానాకూడా కోర్టు విధించింది.
- Tags
- బండ్ల గణేష్
Next Story

