Tue Feb 03 2026 02:00:19 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమికుల మధ్య గొడవ... చివరకు?

అంబర్ పేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని గోల్నాక లో ప్రేమికుల మధ్య గొడవ బాలిక ప్రాణాలకు ముప్పు తెచ్చింది. 17 ఏళ్ళ బాలికకు స్థానిక కూరగాయల వ్యాపారి సోహైల్ తో ఏర్పడిన స్నేహం ప్రేమకు దారితీసింది. ఈ నెల 27వ తేదీన బాలిక ఇంటికి సోహైల్ వెళ్ళాడు. ఏంజరిగిందో తెలీదు కానీ బాలిక కు నిప్పు అంటుకుని తీవ్రాయగాయాలయ్యాయి. స్థానికులు బాలికను వెంటనే ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. నెలన్నర క్రితమే బాలిక కుటుంబం తమ ఇంట్లో అద్దెకి దిగిందని, ఆ అమ్మాయికి, అబ్బాయికి మధ్య గొడవజరిగిందని, ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరని ఇంటి యజమాని చెప్పారు. డెబ్భై శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలిక ఈరోజు మృతి చెందింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన సోహైల్ ప్రస్తుతం పోలిసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Next Story
