Mon Apr 13 2026 07:35:47 GMT+0530 (India Standard Time)
ప్రముఖ సినీ రచయిత ఎంవీఎస్ కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత ఎంవీఎస్ హరనాథరావు సోమవారం కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌లో హరనాథరావు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 150 సినిమాలకు మాటల రచయితగా ఎంవీఎస్ పని చేశారు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం వంటి చిత్రాలకు మాటలు రాశారు. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు చిత్రాలకు ఉత్తమ రచయితగా నంది అవార్డు ఎంవీఎస్ను వరించింది. రాక్షసుడు, స్వయంకృషి సహా పలు చిత్రాల్లో హరనాథరావు సహాయ నటుడిగా నటించారు. సినీ మాటల రచయితగా హరనాథరావును టి. కృష్ణ ప్రోత్సహించారు.
Next Story

