Sun Mar 29 2026 02:41:46 GMT+0530 (India Standard Time)
పోలీస్ స్టేషన్లో వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. మహిళను కించపర్చే విధంగా మాట్లాడారని సామాజిక కార్యకర్త దేవి ఫిర్యాదు చేశారు. తనను కూడా అసభ్యకరంగా వర్మ మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో రెండుసార్లు వర్మకు పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే తాను షూటింగ్ లో ఉన్నానని రాలేకపోతున్నానని సమాధానం చెప్పారు. అయితే ఈరోజు మాత్రం రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. మొత్తం పది ప్రశ్నలతో పోలీసు అధికారులు వర్మ నుంచి సమాధానాలు రాబట్టే అవకాశముంది. మహిళను అశ్లీలంగా చూపించడమేంటి? మాల్కోవా ఫొటోలో మీ ఫేస్ బుక్, ట్విట్టర్లో ఎక్కడి నుంచి వచ్చాయి? దేవితో పోర్న్ సినిమా తీస్తాననడం ఎంతవరకూ కరెక్ట్? వంటి ప్రశ్నలు వర్మ ఎదుర్కొననున్నట్లు తెలుస్తోంది. వర్మను నాలుగు గంటలపాటు ప్రశ్నించే అవకాశముంది.
- Tags
- రామ్ గోపాల్ వర్మ
Next Story

