Wed Mar 25 2026 12:54:29 GMT+0530 (India Standard Time)
పోరు ఎప్పుడో తేలేది కాసేపట్లో

ఈరోజు కర్ణాటక విధాన సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఉదయం 11గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినప్పటికీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయిపోయింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు పలుమార్లు కర్ణాటకలో పర్యటించారు. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో ఇక అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తం కావాల్సి ఉంది.
Next Story

