పోయెస్ గార్డెన్ లో శశి కీలక పత్రాలు లభ్యం?

పోయెస్ గార్డెన్ నూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు వదల్లేదు. తాజాగా ఈరోజు జయలలిత నివాసమైన వేదనిలయంలో ఐటీ శాఖ దాడులు జరిపింది. పోయెస్ గార్డెన్ లో శశికళకు రెండు గదులున్నాయి. ఈ గదులను చెక్ చేసేందుకే ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు పోయెస్ గార్డెన్ లో ఐటీ శాఖ అధికారుల సోదాలను శశికళ అనుచరులు అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య సోదాలు చేస్తున్నారు. శశికళ గదుల్లో పెన్ డ్రైవ్ లు, కీలక పత్రాలు లభించాయని తెలుస్తోంది. అయితే పోయెస్ గార్డెన్ లో సోదాలపై శశికళ మేనల్లుడు దినకరన్ ఫైర్ అయ్యారు. ఎప్పుడో డీఎంకే హయాంలో వేదనిలయంలో ఐటీ దాడులు జరిగాయన్నారు. మళ్లీ అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండగానే వేదనిలయంలో సోదాలు జరగడంపై ఆయన మండిపడ్డారు. దీనివల్ల అమ్మ జయలలిత ఆత్మ క్షోభిస్తుందన్నారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఆడుతున్న డ్రామాగా దినకరన్ అభివర్ణించారు. ఇటీవల ఆరురోజుల పాటు శశికళ సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు వేదనిలయంలో దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.
- Tags
- పోయెస్ గార్డెన్

