పోకిరీ మేనేజర్!

ఆయన ఓ ఐటీ కంపెనీకి హెచ్ఆర్ మేనేజర్. ఉన్న ఉద్యోగుల్ని బాగా చూసుకోవడం, కొత్త ఉద్యోగుల్ని నియమించుకోవడం ఆయన పని. అలాంటివాడు కామాంధుడిలా మారాడు. ఉద్యోగాల కోసం వచ్చే అమ్మాయిలపై కన్నేశాడు. ఓ అమ్మాయిని అయితే ఏకంగా హాట్ ఫోటోలు అడిగాడు. అలాంటి ఫోటోలు పంపిస్తేనే ఉద్యోగమిస్తానని కండిషన్ పెట్టాడు. ఆయన తీరుతో షాకైన యువతి... పోలీసులకు ఫిర్యాదు చేసింది. టిప్‌టాప్‌గా రెడీ అయి ఆఫీసుకు వెళ్లే సదరు హెచ్ఆర్ మేనేజర్ ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.
హాట్ ఫొటోలు పంపితేనే...?
పనీపాటా లేని పోకిరీలు అమ్మాయిల్ని వేధించిన ఘటనలు చాలానే చూశాం. ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఈయన కూడా పోకిరీలా తయారయ్యాడు. అతనే నరేందర్ సింగ్. హిమాయత్‌నగర్‌కు చెందిన ఇతను హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్. నెల రోజుల క్రితం అతని కంపెనీలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. చాలామంది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. నియామకాల సంగతేమో కానీ... ఇంటర్వ్యూకు వచ్చిన ఓ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. రెజ్యూమ్ లో ఉన్న అమ్మాయి నెంబర్‌కు కాంటాక్ట్ చేశాడు నరేందర్ సింగ్. నెల దాటినా... జాబ్ గురించి కన్ఫర్మేషన్ లేకపోవడంతో... తన ఉద్యోగం ఏమైందని ఆ అమ్మాయి అడిగింది. నరేందర్ నుంచి మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్ వచ్చింది. నీ హాట్ ఫోటోస్ పంపిస్తేనే... సెలక్ట్ అయ్యావో లేదో చెబుతానంటూ రిప్లై వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అడిగినా... ఇలాగే సమాధానమిచ్చాడు నరేందర్. తాను మరికొన్ని ప్రముఖ సంస్థలకూ రిక్రూట్మెంట్స్ చేస్తుంటానని, హాట్ హాట్ ఫొటోలు పంపితేనే ఉద్యోగం వచ్చేలా చేస్తానని, లేకుంటే భవిష్యత్తులోనూ ఎక్కడా ఉద్యోగం రాదని బెదిరించాడు. ఎక్కడ జాబ్ రావాలన్నా ఇదే ప్రాసెస్ అంటూ మానసికంగా వేధించాడు. అంతేకాదు... ఆమెకు వాట్సాప్‌లో అశ్లీల చిత్రాలు పంపాడు. ఆమె ఫోన్ చేసి పలుమార్లు మందలించింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో... ఆ మెసేజ్‌లన్నీ తీసుకుని వెళ్లి షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది ఆ యువతి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా రిమాండ్ విధించింది.
- Tags
- పోకిరీ మేనేజర్

