పూతలపట్టులో పట్టు కోసం జగన్....?

వైసీపీ అధినేత జగన్ పూతలపట్టు నియోజకవర్గంలో కి ప్రవేశించారు. పూతలపట్టులో మరోసారి తన పట్టును నిలుపుకునేందుకు ఈ పాదయాత్ర తోడ్పడుతుంది. పూతలపట్టు నియోజకవర్గంలో తొలి నుంచి టీడీపీకి పట్టు లేదు. గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ పై టీడీపీ అభ్యర్థి లలిత కుమారి ఓడిపోయారు. అలాగే 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రవి టీడీపీ అభ్యర్థి లలిత కుమారిపై గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. కేవలం 902 ఓట్ల మెజారిటీతోనే ఇక్కడ వైసీపీ గెలిచింది. దీంతో మరోసారి తన పాదయాత్ర ద్వారా పూతలపట్టు పై మరింత పట్టుపెంచుకునేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నారు.
మంచి స్పందన....
పూతలపట్టులోని గొట్టాల క్రాస్ రోడ్స్ మీదుగా గుండ్లపల్లి చేరుకుని వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సవటపల్లి, పాలకల సంతగేట్, పాటూరు మీదుగా చౌడుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. రాత్రి మొరవ పాటూరు వద్ద జగన్ బస చేశారు. పూతల పట్టు నియోజకవర్గంలో కూడా వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. దారిపొడవునా మహిళలు పూలతో స్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.
జన్మభూమి అంటూ కబుర్లు.....
అంతకు ముందు చంద్రగిరి నియోజకవర్గంలో జగన్ పర్యటించారు. చంద్రగిరి నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. చంద్రగిరిని పట్టించుకోని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. నాలుగేళ్ల నుంచి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ జిల్లాను పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. పైగా జన్మభూమి అంటూ కబుర్లు చెబుతున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రమంతటా మాఫియా ముఠాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. చివరికి చంద్రబాబునాయుడు సొంతగ్రామంలో ఆయన చదువుకున్న స్కూలు కూడా దుస్థితికి చేరుకుందని, దీన్ని బట్టి సొంత గ్రామం, నియోజకవర్గం, జిల్లాను ఎంత బాగా చేస్తున్నారో అర్థమవుతుందన్నారు.
- Tags
- జగన్

