Tue Mar 24 2026 20:06:52 GMT+0530 (India Standard Time)
పార్లమెంటుకు వెళుతూ చంద్రబాబు...?

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంటుకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంటుకు చేరుకున్న చంద్రబాబు పార్లమెంటు ఆవరణలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు మెట్లకు ఆయన నమస్కరించడం విశేషం. పార్లమెంటు మెట్లకు నమస్కరించి ఆయన లోపలకి అడుగుపెట్టారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో చంద్రబాబు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలవనున్నారు. కాంగ్రెస్, బీజేపీని మినహాయించి మిగిలిన పార్టీల నేతలందరనీ చంద్రబాబు కలుస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

