Sun Dec 21 2025 23:53:16 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ స్పందించారు.. అంతే : కొత్త సంగతుల్లేవ్

దాదాపు 12 రోజులుగా ప్రజలు నోట్ల విషయంలో నానా కష్టాలు పడుతోంటే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. కేంద్రం ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదంటూ, జాగ్రత్తలు పాటించలేదంటూ విమర్శించారు. ఆయన తన ట్విటర్ అకౌంటర్ ద్వారా ఈ స్పందనను తెలియజేశారు.
ఈ రద్దు వలన పరిణామాల విషయంలో పవన్ వెల్లడించిన కొత్త సంగలు, అభిప్రాయాలు, సలహాలు ఏమీలేకపోవడం విశేషం. ఇన్ని రోజులుగా అందరూ చెబుతున్న మాటలనే ఇవాళ పవన్ క్రోడీకరించి ట్విటర్ లో పెట్టినట్లుగా ఈ కామెంట్లు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story

