పవన్ యాక్షన్.... బాబు రియాక్షన్.....!

ఏపీ సీఎం చంద్రబాబు దృష్టిలో ప్రతిపక్షం జనసేన. జనసేనాని ఎత్తుకునే సమస్యలే ఆయనకు వాస్తవంగా అనిపిస్తూ వాటి పరిష్కారానికి సీరియస్ గా దృష్టి పెడతారు. అందుకే రాష్ట్రంలో చాలామంది పవన్ కళ్యాణ్ దృష్టికి తెస్తారు. ఆయన స్పందిస్తే చాలు చంద్రబాబు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారన్న నమ్మకం అందరికి వచ్చింది. తాజాగా విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పై పవన్ స్పందించారు. అక్కడికి వెళ్ళి లాభాల్లో వున్న సంస్థను కేంద్రం ప్రవేటీకరణ ఎలా చేస్తుందని కేంద్రాన్ని నిలదీశారు. అక్కడి ఉద్యోగుల ఆందోళనకు మద్దత్తు ప్రకటించారు. ఇటీవల డిసి ఐ ని ప్రయివేటీకరిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని పికె సందర్శించారు. పవన్ అలా స్పందించి 24 గంటలు కూడా గడవకుండా ఏపీ సీఎం స్పందించేశారు . పవన్ కళ్యాణ్ ఏవైతే చెప్పారో అన్ని కరక్టే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రమేష్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. కేంద్రం లాభాల్లో వున్న సంస్థను ఎలా ప్రైయివేట్ వ్యక్తులకు ఇస్తుందన్నారు బాబు. ఇలా పవన్ - చంద్రబాబు ల జోడి యాక్షన్ రియాక్షన్ లా సాగడం చర్చనీయాంశంగా మారింది.
పోలవరం పై మాత్రం భిన్నంగా స్పందించిన చంద్రబాబు ...
పోలవరం ప్రాజెక్ట్ సందర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై తక్షణం శ్వేత పత్రం డిమాండ్ చేశారు. రోజు అన్ని ఆన్ లైన్లో పెడుతుంటే శ్వేత పత్రం అవసరం లేదని చంద్రబాబు కొట్టిపారేశారు. అయితే ప్రాజెక్ట్ పై పవన్ కి చిత్తశుద్ధి ఉందని, వైసిపి వారికి మాత్రం ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవడమే కావాలంటూ వ్యాఖ్యానించడం చూస్తే టిడిపి, జనసేన హిడెన్ ఎజెండా తేటతెల్లం అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పవన్ విశాఖ, పోలవరం, రాజమండ్రి కార్యక్రమాల్లో టిడిపి పై చేసిన విమర్శలపై మాత్రం బాబు స్పందించకపోవడం గమనార్హం.

