Mon Apr 06 2026 05:16:40 GMT+0530 (India Standard Time)
పవన్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిదే...!

పవన్ పోలవరం పూర్తి కావాలనుకుంటుంటే... వైసీపీ నేతలు మాత్రం పోలవరాన్ని అడ్డుకుంటున్నారన్నారు. పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ కు చంద్రబాబు స్పందించారు. తాను ప్రతిరోజూ పోలవరం పై అన్ని విషయాలు చెబుతున్నామని, ఇంక శ్వేతపత్రం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం పనులు గత కొంతకాలంగా ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రాజెక్టులు చరిత్రలో ఎప్పుడైనా సకాలంలో పూర్తయ్యాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. దీనిపై ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు.
- Tags
- చంద్రబాబు
Next Story

