Mon Apr 06 2026 06:35:54 GMT+0530 (India Standard Time)
పవన్ ప్యాకేజీ ఆర్టిస్ట్...అట...!

వపన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ ఆర్టిస్ట్ అని వైసీపీ నేత రోజా అన్నారు. వపన్ కల్యాణ్ తన అన్న చిరంజీవిని మోసం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. చిరంజీవిని ముంచింది పవన్ కల్యాణ్ కాదా? అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు చిరంజీవిని మోసం చేసినందుకు తొలుత తనకు తాను పవన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. చిరంజీవి వల్లనే పవన్ సినిమాల్లోకి వచ్చిన విషయం గుర్తులేదా అని అన్నారు. పవన్ కల్యాణ్ వారసత్వ రాజకీయాల మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబును ఎందుకు విమర్శించలేకపోతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పవన్ ఇప్పటికైనా రాజకీయాల్లో అవగాహన పెంచుకుని మాట్లాడాలన్నారు. ప్రత్యేక హోదాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
- Tags
- పవన్ రోజా
Next Story

