పవన్ పవర్ చూపిస్తున్నాడే....!

జనసేన నేత పవన్ కల్యాణ్ నేడు విజయవాడకు చేరుకున్నారు. చినకాకాని లో ఆయన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. జనసేనాని దూకుడు పెంచేశారు. వరుసగా కార్యకర్తల సమావేశాలతో పాటు సమస్యలపై స్పందించడంతో పాటు పార్టీ కార్యాలయానికి కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో సీరియస్ గానే ఉన్నారని పిస్తోంది. విశాఖలో ఉత్తరాంధ్ర జనసైనికులతో సమావేశమైన పవన్ కల్యాణ్, తర్వాత రాజమండ్రిలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తలతో సమావేశమయ్యారు. నేడు విజయవాడలోని కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. దీంతో విజయవాడలో పవన్ కల్యాణ్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం......
కార్యకర్తలకు జనసేనాని దిశానిర్దేశం చేస్తున్నారు. తాను పార్టీ పెట్టడానికి కారణాలను వారికి వివరిస్తున్నారు. పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలను వారికి నూరిపోస్తున్నారు. పార్టీలో ఎలా నడుచుకోవాలో చెబుతున్నారు. దీంతో పాటు వారికి జనవరి నెలలో శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా మెగా అభిమానులతో పాటు తటస్థులు కూడా ఆయన సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రసంగాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా సమస్యలపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఫాతిమా కళాశాల విద్యార్థులతో పవన్ భేటీ అయ్యారు. దీంతోపాటుగా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అమరావతిలో పార్టీ కార్యాలయాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో కొంత దూకుడు పెంచారనే అనిపిస్తోంది.
- Tags
- పవన్ కల్యాణ్

