Sun Apr 05 2026 11:57:33 GMT+0530 (India Standard Time)
పవన్ ను పట్టించుకోవద్దన్న జగన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. వైసీపీ పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలతో సమావేశమైన జగన్ పవన్ ది రెండు మూడు రోజుల హడావిడేనని చెప్పారు. అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదని, పవన్ ను లైట్ గా తీసుకోమని నేతలకు జగన్ సూచించారు. పవన్ చేసే వ్యాఖ్యల వల్ల పార్టీకే ప్రయోజనమన్నారు. పవన్ చేసే ప్రతి వ్యాఖ్య టీడీపీకి అనుకూలంగా ఉందని, ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి, ప్రతిపక్షంపై విరుచుకుపడ్డటప్పుడే పవన్ తన విలువను కోల్పోయారని ఆయన సీనియర్ నేతలతో అన్నట్లు తెలిసింది. అందుకని పవన్ వ్యాఖ్యలపై రోజూ స్పందించవద్దని కూడా ఆయన నేతలకు తెలిపారు.
- Tags
- పవన్ జగన్
Next Story

