Thu Mar 26 2026 02:27:21 GMT+0530 (India Standard Time)
పవన్ నిమిషానికో డైలాగ్ చెబుతున్నాడు

పవన్ తెలియక కాదు తెలిసే మాట్లాడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి వైసీపీ, జనసేన వత్తాసు పలుకుతున్నాయన్నారు. పవన్ రోజుకో మాట, మాట్లాడుతున్నారన్నారు. నిమిషానికో డైలాగ్ చెబుతున్నారన్నారు. బీజేపీ న్యాయం చేస్తుందనే తాము ఆరోజు మద్దతుగా ఉన్నామన్నారు. నాలుగేళ్లు ఏపీకి న్యాయం చేస్తుందని ఓపిగ్గా ఎదురు చూశానన్నారు. తొందరపడి తాను నిర్ణయాలు తీసుకోలేదన్నారు. అయితే బీజేపీ నాలుగేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేనల బండారాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. దెబ్బతిన్న ఏపీకి అండగా నిలవాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదన్నారు.
- Tags
- పవన్ చంద్రబాబు
Next Story

