Sun Dec 28 2025 12:44:35 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ జనసేనకు అసలు ఆయన గుర్తింపు అవసరమా?

తెలంగాణాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతురావుకి ఈ మధ్యన బాగా పబ్లిసిటీ పిచ్చి పట్టినట్లుంది. తరుచూ వార్తలొక్కేసిస్తున్నాడు. మొన్నీమధ్యనే పోసాని కృష్ణ మురళితో టీవీ ఛానెల్ లో గొడవపడి మరీ అందరి నోళ్ళలో నానిన వి.హెచ్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకొచ్చాడు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించి మరొక్కసారి హైలెట్ అయ్యాడు.
పవన్ పెట్టిన జనసేన పార్టీ అసలు పార్టీనే కాదని సంచలనాత్మకం గా మాట్లాడాడు. ఏపీలో రెండు పార్టీలకు మాత్రమే అని అవి టిడిపి, వైసిపి మాత్రమే అని అన్నాడు. ఇక త్రీ వ పార్టీ ఏమైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని చెప్పాడు. అంతేకాని జనసేన పార్టీనే ఏపీలో త్రీ వ పార్టీ అని చెప్పకూడదని అదసలు పార్టీనే కాదని తేల్చేసాడు. ఇక చంద్రబాబుని, బిజెపి వాళ్ళని పవన్ ఎంతగా విమర్శించినా కూడా వారికి ఫెవర్గానే ఉంటాడు గాని వారితో విభేదాలు పెంచుకోడని కొన్ని విషయాలు చూస్తే అర్ధమవుతుందని అంటున్నాడు. ఇంకా విషయాలు కూడా ఏమిటనేవి చెప్పి మరీ అందరిని ఆశర్యపరిచాడు. ఆ విషయాలేమిటంటే పవన్ కాపు కులస్తుడైనప్పటికీ కాపులకి అనుకూలం గా ఏం చెయ్యడం లేదని.... వారికి అసలు మద్దతు ఇవ్వడం లేదని అన్నాడు. అందుకే కాపు ఉద్యమానికి పవన్ మద్దతివ్వకుండా గమ్మునున్నాడని అంటున్నాడు. ఇక ఎలాగూ చంద్రబాబు కాపు ఉద్యమాన్ని అణిచివేయ్యడానికి సకల విధాలా ప్రయత్నిస్తున్నాడని.... మరి కాపు కులం నుండి వచ్చిన పవన్ మాత్రం ఇదేమిటని బాబుని ప్రశ్నించకపోగా సైలెంట్ గా సినిమాలు తీసుకుంటున్నదని ఎద్దేవా చేసాడు.
పవన్ విషయాలతో పాటు ఆయన సీనియర్ ఎన్టీఆర్ గురుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఎన్టీఆర్ ఒక కమిట్మెంట్ వున్నా నాయకుడని ఇక ఇప్పుడు సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులంతా కేవలం టచ్ అప్ నాయకులని సంచలనంతకం గా మాట్లాడాడు. అలాగే పవన్ కి అసలు కమిట్మెంట్ లేదని ఉంటే ముద్రగడ కాపు ఉద్యమానికి మద్దతిచ్చేవాడని... కాపులకి అన్యాయం జరగకుండా పవన్ కాపాడేవాడని అంటున్నాడు.
Next Story

