Mon Apr 06 2026 05:17:56 GMT+0530 (India Standard Time)
పవన్ కు కృష్ణయ్య కౌంటర్

బీసీనేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పవన్ పై ఫైరయ్యారు. కృష్ణయ్య కాపు రిజర్వేషన్లపై ద్వంద వైఖరిని అవలంబిస్తున్నారని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. టీడీపీ మేనిఫేస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం పెట్టినప్పుడు బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఎందుకు స్పందించలేదన్నారు. దీనిపై కృష్ణయ్య పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజునాధ కమిషన్ ఇవ్వకముందే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడం పవన్ కు తప్పని తెలియదా? అని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫేస్టోలో బీసీ సంక్షేమం కూడా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈనెల 24వ తేదీన మైలవరంలో బీసీ గర్జన సభపెడుతున్నట్లు కృష్ణయ్య తెలిపారు.
Next Story

