Tue Feb 03 2026 23:01:48 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కామెంట్స్ పై లోకేష్ ఫైర్

పవన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్పందించారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇటీవల లోకేష్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ తనపై దుమ్మెత్తి పోస్తే తాను దులుపుకోవాలా? అని లోకేష్ ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తన ఆస్తులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిరాధార ఆరోపణలు చేస్తే తాను స్పందించాలా? అని ప్రశ్నించారు. ఆధారాలుంటే ఒక్కరోజులోనే పవన్ ఎలా మాట మారుస్తారన్నారు. తాను పుట్టేనాటికే తన తాత సీఎం అని గుర్తు చేశారు. అహర్నిశలూ కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు పవన్ రేటింగ్ ఇస్తారా? అంటూ నిలదీశారు. నాలుగేళ్లు మిత్రపక్షంగా ఉన్న పవన్ కు ఇప్పుడే ఏపీలో అవినీతి గుర్తుకొచ్చిందా? అని అన్నారు. తాతకు చెడ్డపేరు తెస్తున్నానని పవన్ వ్యాఖ్యానించడంపై తాను బాధపడ్డానన్నారు.
Next Story
