పవనిజం పై వర్మ హాట్ కామెంట్స్

ఎవరినైనా లెక్కచేయకుండా తన మనసులో వున్నది ఉన్నట్లు సోషల్ మీడియా వాల్ మీద కక్కేసుకోవడంలో రాంగోపాల్ వర్మ కు మించిన వారు ఎవరు ఉండరేమో . తాజా గా మరోసారి ఆయన హీరో పవన్ కళ్యాణ్ పై పడ్డారు. పవనిజం పేరిట విడుదలైన పుస్తకంపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆ పుస్తకంలో వున్న దానికన్నా పవన్ దగ్గర ఎక్కువ జ్ఞానమే ఉంటుందన్నారు. ఆ పుస్తకం చదివానని నేటి సమాజానికి 100 శాతం పవనిజం అవసరమే అన్నారు . ఇలా డిఫెరెంట్ సెటైర్స్ తో నెటిజెన్లను అలరించాడు వర్మ.
ఎన్టీఆర్ జీవితం మహాభారతం అన్న వర్మ ...
మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని మహాభారతం తో పోల్చారు రామ్ గోపాల్ వర్మ. ఆయన జీవితంలో ఒక అధ్యయనం మాత్రమే తాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నా అని వ్యాఖ్యానించారు వర్మ. తాను ఫిలిం మేకర్ ను అని ఎవరికి ఇష్టం వున్నా లేకపోయినా సినిమా తీసి తీరతానన్నారు ఆయన . అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫర్వాలేదని కామెంట్ చేశారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో వర్మ నిత్యం హాట్ టాపిక్ గా కొనసాగుతూ ఉండటం విశేషం.
- Tags
- పవన్ వర్మ

