పండగలా దిగివచ్చాడే అంటూ జగన్ కు ...

సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిన రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి తమ ముంగిటకు పండగ నాడు రావడంతో ఆ గ్రామాన సంబరాలు వెల్లివిరిసాయి. భోగి పండగ తమ నాయకుడు ఒకే రోజు రావడంతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వెన్నూరు వైసిపి అధినేతకు మరపురాని స్వాగతం పలికింది. రంగు రంగుల రంగువెల్లులు, గొబ్బెమ్మలు, భోగిమంటలతో పెద్ద ఎత్తున జగన్ ను అక్కున చేర్చుకున్నారు అక్కడి ప్రజలు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 62 వ రోజు జగన్ వెన్నూరు కి విచ్చేశారు. గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
జగన్ అధికారంలోకి రావాలి మా సమస్యలు తీరాలి అంటూ ...
చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ జగన్ కు అఖండ స్వాగతంతో పాటు సమస్యలు పలకరించాయి. ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఇబ్బందులు విపక్ష నేతకు వివరించారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో గొడ్డుల్లా పనిచేయిస్తున్నా నేటికీ ఉద్యోగ భద్రత లేదని వారు వాపోయారు. ఏళ్లతరబడి అనేక సమస్యలు తో ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వానికి చెబుతున్నా వినే నాధులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇక రైతులు రుణమాఫీ చేస్తామని అన్యాయం చేశారని, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామంటే ఓట్లేసి మోసపోయామని చంద్రబాబు ప్రభుత్వం పై ఫిర్యాదులను వెల్లువెత్తారు. తమ కుటుంబాన్ని ఎంతో అభిమానించే ఆ ప్రాంత ప్రజలతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం పట్ల జగన్ సంతోషం వ్యక్తం చేశారు.
- Tags
- జగన్

