Wed Mar 25 2026 08:00:43 GMT+0530 (India Standard Time)
నో...సారీ..అన్న విజయసాయి

తాను చంద్రబాబునాయుడికి క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను నిజాలే మాట్లాడానని, అందులో తాను చింతించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న చంద్రబాబుపైన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. జగన్ దిష్టిబొమ్మలు సయితం దహనంచేశారు. ఈనేపథ్యంలో తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం విశేషం. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలే తనకు క్షమాపణ చెప్పాలన్నారు విజయసాయిరెడ్డి.
Next Story

