Tue Apr 30 2024 08:18:44 GMT+0000 (Coordinated Universal Time)
నేను తెరాస చేరితే హరీష్ పని అయిపోయినట్లే!
తెరాసలో చేరితే చౌకీదారుగా పని చేయాలి, ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను తెరాసలో చేరను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. నేను తెరాసలో చేరితే హరీష్ రావు పని అయిపోయినట్లేనని ఆయన అన్నారు. తనకు చౌకీదార్లుగా పని చేసే వారినే హరీష్ రావు తెరాసలో చేర్చుకుంటున్నారని, నేను ఆ పని చేయను కాబట్టి నా జోలికి రాడన్నారు. కాంగ్రెస్ ను వీడి గతంలో భాజపాలో చేరడం తాను చేసిన పెద్ద పొరపాటని పేర్కొన్న జగ్గారెడ్డి.. భవిష్యత్ లో మరో తప్పిదం చేయబోనని స్పష్టం చేశారు. తెరాసలో చేరుతున్నానంటూ కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Next Story