నిట్టనిలువుగా చీలిన టీడీపీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిట్టనిలువుగాచీలిపోయింది. ఈరోజు రెండు గ్రూపుల సమావేశాలు జరుగుతున్నాయి. గోల్కొండ హోటల్ లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఎల్. రమణ హెచ్చరికలు జారీచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదని రమణ రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అన్ని అర్హతలు కోల్పోయారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెబితేనే పార్టీ కార్యక్రమాలునిర్వహించే అవకాశం ఉందన్నారు. వ్యక్తుల కన్నా పార్టీయే గొప్పదన్నారు. రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలకు టీడీపీ నేతలు ఎవరూ వెళ్లవద్దని ఆయన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబుకు తాము అన్ని పరిస్థితులు వివరించామని, ఆయన సూచన మేరకే తాము ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకున్నామన్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు... రెండు గ్రూపులు....
అయితే రేవంత్ రెడ్డి మాత్రం గోల్కొండ హోటల్ జరిగే సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే టీడీఎల్పీ లీడర్ గా తాను ఈరోజు అసెంబ్లీ హాలులో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత ఎవరికీ లేదన్నారు రేవంత్. తాను చెప్పాల్సిన విషయాలన్నీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకే చెప్తానన్నారు. మరెవ్వరితో తన అభిప్రాయాలను పంచుకోలేనన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ టీడీపీలో ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ శాసనసభ్యుడు ఆర్ కృష్ణయ్య మాత్రం తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తాను భవిష్యత్ పై పునరాలోచించుకుంటానన్నారు. రేవంత్ రెడ్డి తొలి నుంచి కేసీఆర్ కు వ్యతిరేకంగానే పోరాడుతున్నారన్నారు. తాను గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పోటీచేశానన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఉంటానో? లేనో? కూడా ఇప్పుడు చెప్పలేనన్నారు. ఇక మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాత్రం రమణ అధ్యక్షతన జరిగే సమావేశానికే హాజరవుతామని చెప్పారు. చూద్దాం మరికాసేపట్లో ఏం జరుగుతుందో?
- Tags
- టీడీపీ

