Wed Apr 01 2026 17:44:12 GMT+0530 (India Standard Time)
నాగం సంచలన ప్రకటన...!

సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి పార్టీ మారడం పై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బీజేపీలోనే ఉన్నానని, ఉగాది తర్వాత భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటిస్తానని చెప్పారు. అయితే రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపై తన అనుచరులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. 2019 ఎన్నికలే తన చివరి ఎన్నికలని నాగం సంచలన ప్రకటన చేశారు. అయితే కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను నడచుకుంటానని, ఉగాది తర్వాత మాత్రం తాను ఏ విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలను కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శించారు. అంటే నాగం ఇక కాంగ్రెస్ గూటికి చేరినట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Next Story

