Sun Mar 29 2026 05:45:38 GMT+0530 (India Standard Time)
నరబలి కేసును ఛేదించిన పోలీసులు...!

ఉప్పల్ నరబలి కేసును ఎట్ట కేలకు పోలీసులు చేదించారు. సరిగ్గా చంద్ర గ్రహణం రోజున బయట పడ్డ ఈ కేసును అమావాస్య రోజున పోలీసులు ఛేదించగలిగారు. పదిహేను రోజుల పాటు పోలీసులకు చుక్కలు చూపిన ఈ కేసులో సాంకేతికత ఆధారంగా కేసును సాల్వ్ చేయగలిగారు పోలీసులు.. ఉప్పల్ చిలుక నగర్ ప్రాంతంలోని క్యాబ్ డ్రైవర్ ఇంటి మీద ఒక పసికందు తల ను స్దానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగి నరహరి తో పాటుగా క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ నుఅనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అయితే చివరకు రాజశేఖర్ ఈ నరబలి చేసి వుంటారని పోలీసులు నిర్దారణకు వచ్చారు. పోలీసుల ఎదుట రాజశేఖర్ నొరు విప్పక పొవడంతో సాంకేతిక ఆధారాలతో ఈ కేసును ఛేదించారు. తన భార్య ఆరోగ్యం సరిగా లేక పొవడంతోనే ఈ నరబలి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
- Tags
- నరబలి
Next Story

